అడ్డంకులు తొలగిపోయాయ్!
ABN , First Publish Date - 2020-10-03T07:31:44+05:30 IST
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారి లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి

అర్హులంతా సచివాలయాల్లో సేవలు పొందొచ్చు ఏడాదిలో మంచి ఫలితాలు
సేవలు, వినతుల నమోదులో ఏపీలో జిల్లాకు ప్రథమ స్థానం
ఆదర్శ సచివాలయాలు, సిబ్బంది అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్
కాకినాడ, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారి లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి అన్నారు. గతంలో ఈ ప్రయోజనాలు పొందడానికి రాజకీయ జోక్యం, అవినీతి, లబ్ధిదారుల్లో అవగాహన లేమి అడ్డంకులుగా ఉండేవని, ఇప్పుడు అవి తొలగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. సచివాలయాలు ఏర ్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్‌లో నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంలోనూ, ప్రవేశపెడుతున్న ప్రతీ పథకంలోనూ సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది గోదావరి వరదలు, కొవిడ్ సమయంలో చేసిన సేవలు మరువ లేనివన్నారు.
వీరిని ప్రోత్సహించే క్రమంలో సచివాలయాలు ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా వారికి అవార్డులిచ్చామన్నారు. వచ్చే జనవరి 26 నాటికి మిగిలిన సచివాలయాలు మెరుగైన పని తీరుతో గుర్తింపు పొందాలని సూచించారు. అవార్డులు పొందిన వారిని అభినందించారు. జేసీ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతిభ చూపిన సచివాలయాల సిబ్బందిలాగే, మిగిలిన వారు కూడా మెరుగైన పనితీరు కనబరచాలని కోరారు. డీపీవో నాగేశ్వర్ నాయక్ ప్రగతి నివేదిక సమర్పిం చారు. కార్యక్రమానికి జేసీ బి రాజకుమారి అధ్యక్షత వహించారు. తొలుత పూజ్య బాపూజీ చిత్ర పటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళి అర్పించారు. రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ అభిషిక్త్ కిశోర్, కాకినాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్, సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
అవార్డులు ఇవే : డివిజన్ విభాగంలో అత్యధిక సేవలు, అభ్యర్థనలు గడువులోగా పరిష్కరిం చిన అమలాపురం డివిజన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకు సబ్‌కలెక్టర్ హిమాంశు కౌషిక్‌కు కలెక్టర్ రోలింగ్ షీల్డ్ అందజేశారు. మండలాల్లో ఐ పోలవరం, కాకినాడ రూరల్, తుని, రాజానగ రం, రాయవరం, అడ్డతీగల, ఎటపాక ఎంపీడీవో, తహసీల్దార్లకు కలెక్టర్ షీల్డ్‌లు బహుకరించారు. ఉత్తమ సేవలందించిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లకు ప్రశంసా జ్ఞాపికలు ఇచ్చారు.