సచివాలయ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-10-07T10:20:58+05:30 IST

గంగవరం సచివాలయ భవన నిర్మాణ పనులు, కొత్తాడ-సూరంపాలెం రహదారి పనులను పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు రాజబాబు, నాగేంద్రప్రసాద్‌ పరిశీలించారు...

సచివాలయ పనుల పరిశీలన

గంగవరం, అక్టోబరు 6: గంగవరం సచివాలయ భవన నిర్మాణ పనులు, కొత్తాడ-సూరంపాలెం రహదారి పనులను పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు రాజబాబు, నాగేంద్రప్రసాద్‌ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ఇంజనీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. రూ.35 లక్షలతో నిర్మిస్తున్న జీప్లస్‌-1 సచివాలయ భవనాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. రంపచోడవరం మండలం పోక్స్‌పేట సచివాలయ భవన పనులను పరిశీలిస్తామని తెలిపారు. వీరివెంట పంచాయతీరాజ్‌శాఖ డీఈ దుర్గాప్రసాద్‌, ఏఈలు వెంకటరమణ, అబ్బాయిదొర, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సతీష్‌ ఉన్నారు. 

Read more