-
-
Home » Andhra Pradesh » East Godavari » Notes for them mouthpieces for the cart
-
వారికి నోట్లు.. బండికి తూట్లు
ABN , First Publish Date - 2020-10-07T08:39:08+05:30 IST
లాభాపేక్ష లక్ష్యంగా కొంద రు తమ బంకుల ద్వారా కల్తీ ఇంధనం విక్రయిస్తు న్నారు...

- పెట్రోల్ బంకుల్లో నకిలీ డీ జిల్, పెట్రోల్ విక్రయాలు
- తేడా ఇంధనంతో బోరుకొస్తున్న వాహనాలు
- బంకుల నిర్వహణ, చమురు విక్రయాలపై తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
మొన్నీమధ్య అంబాజీపేటకు చెందిన ఓ షావుకారు కరోనాతో బాధపడి పూర్తిగా కోలుకున్నారు. దీంతో కుటుంబ సమేతంగా కారులో అన్నవరం బయల్దేరారు. కాకినాడ వచ్చాక ఎందుకైనా మంచిదని రాకపోకలకు సరిపడా డీజిల్ ఉన్నా ట్యాంక్ ఫుల్ చేయించారు. కత్తిపూడి హైవేలో బండి మొండికేసింది. కదలనంటూ మొరాయించింది. అంబాజీపేట నుంచి పిఠాపురం వరకూ సాఫీగా సాగిన కారు ప్రయాణం ఒక్కసారిగా చుక్కలు చూపడంతో ఆయన స్థానికంగా ఉన్న ఓ మెకానిక్‌ను తీసుకువచ్చి కారు చెక్ చేయించారు. మొత్తం చెక్ చేయగా, డీజిల్‌లో కిరోసిన్ కలిసిందని, దీనివల్ల వాహన నాజిల్స్ పాడయ్యాయని, కొత్తవి వేయాలంటే రూ.80 వేలు అవుతుందని చెప్పడంతో షావుకారు కంగుతిన్నారు. డీజిల్ పోయించిన తర్వాత కాకినాడ బంకులో కల్తీ జరిగిందా, అంతకుముందు వెళ్లినప్పుడు డీజిల్ పోయించిన రావులపాలెం బంకులో జరిగిందో ఈ వ్యాపారి తేల్చుకోలేక ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీకా గమ్మునున్నాడు. పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలకు ఇది ఓ ఉదాహరణ. మార్కెట్లో వాహనాల వినియో గం పెరిగింది. వీరి అభిరుచులకు తగ్గట్టు పలు మోడళ్లలో వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతోంది. అయితే లాభాపేక్ష లక్ష్యంగా కొంద రు తమ బంకుల ద్వారా కల్తీ ఇంధనం విక్రయిస్తు న్నారు. ఇంకొందరు నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భారత్ పెట్రోలి యం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఇండియన్ ఆయిల్ కార్పొ రేషన్ (ఐవోసీఎల్) కంపెనీల ఆధ్వర్యంలో జిల్లాలో సుమారు 400 వరకు పెట్రోల్ ఔట్‌లెట్స్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు ఎస్సార్ గుజరాత్, రిలయన్స్ కంపెనీల ద్వారా మరో 50 బంకులున్నాయి. ఇందులో అధిక శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని బంకుల్లో నకిలీ ఇంధనం రాజ్య మేలుతోందని సమాచారం. ఏడాది కాలంలో బంకుల్లో జరు గుతున్న మోసాలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, తర్వాత తూనికలు, కొలతల అధికారులు వరుస తనిఖీలు చేశారు.
అయితే వీరి తనిఖీల్లో ఎన్ని అక్రమాలు వెలుగు చూశాయనేది సదరు శాఖల అధికారులు మీడియాకు వెల్లడించకపోవడం గమనార్హం. అలాగే కల్తీ విషయంలో వినియోగదారులు సివిల్ సప్లయి అధికారులకు ఫిర్యాదు చేసినా కేసులను రాజీ చేయడం తప్ప జేసీ కోర్టులో ఎంతమంది డీలర్లపై చర్యలు తీసుకున్నారనేది బహిరంగం చేయకపోవడం విశేషం. ఇక నకిలీ ఇంధనం వల్ల వాహ నాలు మొరాయిస్తున్నాయి. వాటి జీవితకాలం తగ్గుతోంది. మరమ్మతులు చేయించడానికి వేల నుంచి లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులు బంకుల నిర్వహణ తీరుపై ఆందోళన చెందుతున్నారు. కొన్ని బంకుల్లో ఇచ్చిన నగదుకు సరిపడా ఇంధనం నింపడం లేదు. మీటర్ టాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంధన విక్రయాలు సజావుగా జరుగుతున్నాయా లేదా అనేది పరిశీ లించాల్సిన సంబంధిత అధికారులు పట్టనట్టు ఉంటున్నారు. దీంతో కొందరి జేబులు అనధికారిక ఆదాయంతో నిండుతు న్నాయి. ప్రభుత్వం కూడా మోసాలపై దృష్టి పెట్టడం లేదు.