మీటర్ల ఏర్పాటుతో ఇబ్బందులుండవు: డీఈ

ABN , First Publish Date - 2020-10-07T10:09:38+05:30 IST

ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేయటం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని జగ్గంపేట విద్యుత్‌శాఖ డీఈ వై.డేవిడ్‌ రైతులకు తెలిపారు...

మీటర్ల ఏర్పాటుతో ఇబ్బందులుండవు: డీఈ

రంగంపేట, అక్టోబరు 6: ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేయటం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని జగ్గంపేట విద్యుత్‌శాఖ డీఈ వై.డేవిడ్‌ రైతులకు తెలిపారు. ఈలకొలను విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రైతులకు రంగంపేట విద్యుత్‌ ఏఈ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్‌ మాట్లాడుతూ మీటర్ల ఏర్పాటుతో రైతులకు అదనంగా ఖర్చు ఉండదని, ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ సరపరా కోసమే మీటర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇందువల్ల 9 గంటల ఉచిత విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. అనధికార కనెక్షన్లన్నీ క్రమబద్ధం చేస్తారని, ప్రభుత్వం రైతులకు నగదు బదిలీ చేస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సింగంపల్లి సోసైటీ అధ్యక్షుడు లంక చంద్రన్న, ఎడీఈ లక్ష్మీనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు.

Read more