కరో ‘నో’ ఎంట్రీ

ABN , First Publish Date - 2020-03-25T09:58:41+05:30 IST

కరోనా ప్రభావంతో రహదారులన్నీ మూసుకుపోయాయి.

కరో ‘నో’ ఎంట్రీ

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దారులన్నీ మూసివేత

జిల్లా, అంతర్రాష్ట సరిహద్దులు కూడా


రాజమహేంద్రవరం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో రహదారులన్నీ మూసుకుపోయాయి. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అయినా అక్కడక్కడా కొంతమంది జనం బయటకు వస్తుండడంతో అధికార, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దారులను దిగ్బంధనం చేశారు. జాతీయ రహదారులపై ప్రధాన కూడళ్లలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య రోడ్డు కం రైలు బ్రిడ్జి, గ్రామన్‌ బ్రిడ్జి, రావులపాలెం-సిద్ధాంతం, బోడసక్రురు- చించినాడ,  ఎదుర్లంక-యానాం వంతెనలతో పాటు ధవళేశ్వరం బ్యారేజీపై రాకపోకలకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. అత్యవసర సందర్భాల్లోనే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. 


ఒడిసా-ఏపీ సరిహద్దు మూసివేత 

చింతూరు: కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిపై నూతనంగా నిర్మించిన రహదారిని సచివాలయ ఉద్యోగులు మూసివేశారు.

Read more