-
-
Home » Andhra Pradesh » East Godavari » Nine hours of uninterrupted electricity to crops
-
పంటలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్
ABN , First Publish Date - 2020-10-07T09:37:23+05:30 IST
రైతులు సాగుచేసే పంటలకు పగటిపూట రోజుకు 9 గంటలు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని ఏడీఈ టీవీఎస్. రామకృష్ణ పేర్కొన్నారు...

సామర్లకోట, అక్టోబరు 6: రైతులు సాగుచేసే పంటలకు పగటిపూట రోజుకు 9 గంటలు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని ఏడీఈ టీవీఎస్. రామకృష్ణ పేర్కొన్నారు. సామర్లకోట మండలం జీ.మేడపాడు పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతన లైన్లు, అదనపు హెచ్‌వీడీఎస్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, ప్రత్యేక ఫీడర్లు వంటి పనులు చేపట్టి మెరుగైన చర్యలు పూర్తి చేశామని ఏడీఈ చెప్పారు. ఇక జూనియర్ లైన్ మెన్‌లు, షిఫ్ట్ ఆపరేటర్లు నియామకం వంటి చర్యలతో లైన్ సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. సమావేశంలో రూరల్ ఏఈ వీరభద్రరావు, మోరంపూడి రంగా పంచాయతీ కార్యదర్శి జేవీఎస్. రామక్రష్ణ తదితర రైతులు పాల్గొన్నారు.