-
-
Home » Andhra Pradesh » East Godavari » ngo state laeder talk
-
ఈహెచ్‌ఎస్ అమలుకు ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2020-12-06T05:45:00+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), డిసెంబరు 5: ఈహెచ్‌ఎస్ అమలు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఎన్‌జీవో సంఘం ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ అన్నారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో శనివారం

రాష్ట్ర ఎన్‌జీవో సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), డిసెంబరు 5: ఈహెచ్‌ఎస్ అమలు పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఎన్‌జీవో సంఘం ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ అన్నారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు పీఎ్‌సఎ్‌సఎన్‌పీ శాస్త్రి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పసుపులేటి మాట్లాడుతూ త్వరలో అందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు మంజూరు కానున్నాయని, సమస్యలేమైనా ఉంటే ముం దుగా ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రను సంప్రదించాలన్నారు. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాధాకృష్ణను, జిల్లా నాయకులను సంప్రదించవచ్చన్నారు. పట్టణ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు మూర్తిబాబు మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. సభాధ్యక్షుడు శాస్త్రి మాట్లాడుతూ ఈహెచ్‌ఎస్ అమలుపై ఇటీవల ఆరోగ్యశ్రీ సీఈవో తీసుకుంటున్న చర్యలు మేలు చేస్తాయన్నారు. లైఫ్ సర్టిఫికెట్లు జనవరి, ఫిబ్రవరిలో ఇవ్వాలని.. ఐటీ సేవింగ్స్ నమూనా ఈనెల 15 లోగా ఎస్‌టీవో కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీఎ్‌సఎ్‌సఆర్ మూర్తి, ఇబ్రహీం, కె.వెంకట్రావు, కె.పద్మనాభం, టి.నూకరాజు, సీహెచ్‌నరసింహారావు, ఎం.తాతారావు, అదినారాయణరావు పాల్గొన్నారు.