మేనమామతో ఇష్టం లేని పెళ్లి.. మూడు రోజులకే ఘోరం..!

ABN , First Publish Date - 2020-08-01T21:16:03+05:30 IST

మేనమామతో జరిగిన పెళ్లి ఇష్టం లేక పురుగుమందు తాగిన నవ వదువు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండపేట సీఐ అడపా నాగమురళి తెలిపిన వివరాల

మేనమామతో ఇష్టం లేని పెళ్లి.. మూడు రోజులకే ఘోరం..!

పెళ్లయిన మూడు రోజులకే..

తనువు చాలించిన నవవధువు

మేనమామతో పెళ్లి ఇష్టంలేకనే ఆత్మహత్య


మండపేట(తూర్పు గోదావరి జిల్లా): మేనమామతో జరిగిన పెళ్లి ఇష్టం లేక పురుగుమందు తాగిన నవ వదువు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండపేట సీఐ అడపా నాగమురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండపేట మండ లం ఏడిద సీతానగరానికి చెందిన మహదాసు రమ్యశ్రీ(20)కి లక్ష్మీనరసాపురానికి చెందిన తన మేనమామతో మూడురోజుల క్రితం వివాహం జరిగింది.


ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను మండపేట ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తరలించగా మధ్యాహ్నం సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందిందని సీఐ నాగమురళి తెలిపారు. ఈ ఘటనపై మండపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - 2020-08-01T21:16:03+05:30 IST