లాక్‌డౌన్‌లో నయా వ్యాపారం.. వెలుగులోకి కొత్త మోసం..!

ABN , First Publish Date - 2020-06-25T19:56:35+05:30 IST

లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలోను, ప్రస్తుతం ఉన్న కొన్ని ఆంక్షల నేపథ్యంలో ఈ పాస్‌లకు ఎనలేని డిమాండు వచ్చింది. వాస్తవానికి ఈ పాస్‌లు కావాలంటే.. ముఖ్యంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు

లాక్‌డౌన్‌లో నయా వ్యాపారం.. వెలుగులోకి కొత్త మోసం..!

నకిలీ కొవిడ్‌- 19 ఈ పాస్‌ తయారీ ముఠా అరెస్ట్‌ 

ఎడాపెడా నకిలీ ఈ పాస్‌ల అమ్మకం

ఉభయగోదావరి జిల్లాల్లో నిందితులు


కాకినాడ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలోను,  ప్రస్తుతం ఉన్న కొన్ని ఆంక్షల నేపథ్యంలో ఈ పాస్‌లకు ఎనలేని డిమాండు వచ్చింది. వాస్తవానికి ఈ పాస్‌లు కావాలంటే.. ముఖ్యంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ప్రయాణించే జిల్లావాసులకు మొన్నటివరకు కలెక్టరేట్‌, ఎస్పీ కార్యా లయం నిబంధనలనుసరించి వాహన ప్రయాణాలకు ఈ పాస్‌లు మంజూరు చేసేవారు. అయితే వీటిని ఓ ముఠా గుట్టుచప్పుడుగా తయారు చేస్తూ లాక్‌డౌన్‌ సమయంలో సొమ్ము చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి పొందిన సదరు నకిలీ పాస్‌ ఎస్పీ కార్యాల యానికి విచారణ నిమిత్తం వెళ్లింది.


దీంతో ఎస్‌బీ డీఎస్పీ అంబికా ప్రసాద్‌ విషయాన్ని టూటౌన్‌ సీఐ ఈశ్వరుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తన బృందంతో విచారణ చేశారు. ఇందులో కరప మం డలం కరకుదురు గ్రామానికి చెందిన టి యదిద్య కుమార్‌, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఏ దిలీప్‌, రాజమహేంద్రవరం తాడితోటకు చెందిన వి అనిల్‌కుమార్‌, తొర్రేడుకు చెందిన ఎస్‌ వెంకటరమణ లను సీఐ తన సిబ్బందితో చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. బుధవారం స్టేషన్‌లో నిందితులను, వారు తయారు చేసిన 22 నకిలీ పాస్‌ల గురించి ఆయన విలేకరులకు వివరించారు. 

Updated Date - 2020-06-25T19:56:35+05:30 IST