పోరాటానికి కాంగ్రెస్‌ సిదఽ్ధం

ABN , First Publish Date - 2020-12-28T05:44:25+05:30 IST

కాకినాడలో తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచేవరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

పోరాటానికి కాంగ్రెస్‌ సిదఽ్ధం
సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌

పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్‌      

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు27: కాకినాడలో తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచేవరకు కాంగ్రెస్‌ పోరాడుతుందని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ స్పష్టం చేశారు.  పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావుతో కలిసి బాలాజీచెరువు సెంటర్‌ వద్ద నెహ్రూ విగ్రహం తొలగించిన ప్రదేశాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజానాథ్‌ మాట్లాడుతూ అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు కాకినాడలో పాలన సాగుతోందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కాకినాడలో నెహ్రూ పర్యటించిన సందర్భాన్ని పురస్కరించుకుని   జవహర్‌వీఽధిగా నామకరణం చేయడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అధికార దాహంతో వాణిజ్య సముదాయానికి కొమ్ముకాస్తూ విగ్రహాన్ని తొలగించడం దారుణమన్నారు. పది రోజుల్లో ఈ సెంటర్‌లో నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించకపోతే కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు.  ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్జి జమ్ము ఆదినారాయణ, కాకినాడ పార్లమెంట్‌ ఇన్‌చార్జి మల్లిపూడి రాంబాబు, కాకినాడ, రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, బాలేపల్లి మురళీధర్‌, నాయకులు కోలా ప్రసాదవర్మ, మార్టిన్‌ లూథర్‌, ఎన్‌వీ శ్రీనివాస్‌, తాళ్లూరి రాజు, పిట్టా అర్జున్‌, మేడిది శ్రీను, తుమ్మలపల్లి వాసు, దవులూరి ధనకోటి, కుక్కల పోతురాజు, అయితాబత్తుల సుభాషిణి, బత్తిన లలిత పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:44:25+05:30 IST