‘పంటనష్టాల అంచనాల్లో అధికారుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-01T07:25:21+05:30 IST

ఏలేరు వరదల కారణంగా పంటలకు జరిగిన నష్టాలు అంచనా వేయడంలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు.

‘పంటనష్టాల అంచనాల్లో అధికారుల నిర్లక్ష్యం

గొల్లప్రోలు, సెప్టెంబరు 30: ఏలేరు వరదల కారణంగా పంటలకు జరిగిన నష్టాలు అంచనా వేయడంలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆరోపించారు. వరద ముంపు కారణంగా గొల్లప్రోలు బైపాస్‌రోడ్డులో కుళ్లిపోయిన వరిపంటను ఆయన బుధవారం పరిశీలించారు.


నష్టం అంచ నా వేసి రైతులకు పరిహారం అందివ్వాల్సి ఉండగా అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించలేదన్నారు. గతంలో నష్టపోయిన వారికి కాకుండా ఇతరులకు పరిహారం అందిందని, అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. అటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే ఏలేరు వరద ముంపునకు కారణమని ఆరోపించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.


Updated Date - 2020-10-01T07:25:21+05:30 IST