‘పేదింట్లో పెద్దల దందా’పై స్పందించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2020-11-03T05:42:13+05:30 IST

పేదింట్లో పెద్దల దందా అనే శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై రామచంద్రపురం ఆర్డీవో ఎం.గాంధీ స్పందించారు. నవరత్నాల పథకాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు రామచంద్రపురం డివిజన్‌లో భూసేకరణ చేపట్టామని ఆయన తెలిపారు.

‘పేదింట్లో పెద్దల దందా’పై స్పందించిన ఆర్డీవో

అనపర్తి, నవంబరు 2: పేదింట్లో పెద్దల దందా అనే శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై రామచంద్రపురం ఆర్డీవో ఎం.గాంధీ స్పందించారు. నవరత్నాల పథకాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు రామచంద్రపురం డివిజన్‌లో భూసేకరణ చేపట్టామని ఆయన తెలిపారు. బిక్కవోలు మండలం కాపవరంలో ఎన్‌ఎ్‌ఫసీఎల్‌కు చెందిన 192.09 సెం ట్ల భూమిని ప్రతిపాదించామన్నారు. ఈ భూమిలో 19.88 సెంట్ల భూమిపై కోర్టు స్టేట్‌సకో ఇవ్వడం, మరో 2.29 సెంట్ట భూమిపై కోర్టులో స్టేట్‌సకో ఉండడంవల్ల మిగిలిన 176.61 సెంట్ల భూమిని మాత్రమే సేకరించే వీలు ఉందన్నారు. ఈ భూమికి నెగోషియేషన్‌ కమిటీ ఎకరాకు రూ.30లక్షల ధర నిర్ణయించిందని చెప్పారు. ఈ భూమిలో ఉన్న చెట్లను నరికి, పెద్ద గోతులను పూడ్చి రోడ్లు అభివృద్ధి చేసిన తర్వాత ప్రభుత్వం సాధీనం చేసుకుంటుందని, దీనికోసం రెండో విడత మరో ఆరునెలల గడువు ఉందని వివరించారు. ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ వారు ధృవపత్రాలు సమర్పించనందున ప్రభుత్వం ఏ విధమైన సొమ్ములు చెల్లించలేదని ఆర్డీవో తెలిపారు.

Updated Date - 2020-11-03T05:42:13+05:30 IST