నవరత్నాలతో సొంతింటి కల సాకారం

ABN , First Publish Date - 2020-12-11T06:24:55+05:30 IST

నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు.

నవరత్నాలతో సొంతింటి కల సాకారం

రాజానగరం, డిసెంబరు 10 : నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు. నిరుపేదలకు నివా స స్థలాలు పంపిణీలో భా గంగా మండలంలో కానవరం, సీతారాంపురం గ్రామాల పరిధిలో ప్రభు త్వం సేకరించిన భూములతోపాటు విభజన ప్రక్రియలను సబ్‌ కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేలా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో మూర్తి, ఆర్‌.ఐ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


సోషల్‌ మీడియాలో అసభ్య దూషణలు

ఫ ఆత్రేయపురం కానిస్టేబుల్‌పై ఎస్పీకి ఫిర్యాదు 

అనపర్తి, డిసెంబరు 10: వ్యక్తిగతంగా, సంస్థాపరంగా పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ అసభ్య దూషణ వ్యాఖ్యలు చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనపర్తి శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు గురువారం కాకినాడలో జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వివరాలను సమితి అధ్యక్షుడు పడాల సుబ్బారెడ్డి అనపర్తిలో మీడియాకు తెలిపారు. ఇటీవల నూతనంగా అనపర్తి శ్రీరామకృష్ణ సేవాసమితి కార్యవర్గం ఏర్పాటు, అనపర్తి రైల్వే ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటుపై గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగులో ఆత్రేయపురం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్న పరశురామ్‌ గణేష్‌.. శ్రీరామకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక సభ్యుడు, రామకృష్ణ మిషన్‌ కార్యవర్గ సభ్యుడు, అనపర్తి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యుడు ముడే దుర్గాప్రసాద్‌ను ఉద్దేశించి పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగే విధంగా పోస్టింగులు పెట్టారని అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో,  జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. 


సిమెంట్‌, ఇసుక బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాలి

మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ 

కోరుకొండ, డిసెంబరు 10 : రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు, గ్రామ సచివాలయాల పేరుతో వస్తున్న ప్రభుత్వ సిమెంట్‌, ఇసుక పెద్దఎత్తున బ్లాక్‌మార్కెటింగ్‌ జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఆరోపించారు. గురువారం కోరుకొండలో టీడీపీ కార్యాలయంవద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి చెందిన ఇసుక, సిమెంట్‌ ప్రైవేట్‌ వ్యక్తులవద్ద కనిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఏ గ్రామంలో చూసినా ఈ అక్రమ బ్లాక్‌మార్కెటింగ్‌ కనిపిస్తుందన్నారు. దీన్ని వెంటనే అరికట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌లు ప్రభుత్వ కార్యాలయాలు లేక వైసీపీ కార్యాలయాలా చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ ఫ్లెక్సీలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం వాటిని తొలగించాలన్నారు. ఈ సమావేశంలో మింగి లక్ష్మీనారాయణ, రొంగల శ్రీనివాస్‌, కొయ్య శామ్యూల్‌, మైరెడ్డి రాంబాబు, నాగా రమేష్‌, పరస శ్రీనివాసు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:24:55+05:30 IST