-
-
Home » Andhra Pradesh » East Godavari » nationel boxingh players
-
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2020-12-30T06:06:37+05:30 IST
రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధిం చిన చింతా అనీలసుధ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు అమలాపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం నాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు.

అమలాపురం రూరల్, డిసెంబరు 29: రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధిం చిన చింతా అనీలసుధ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు అమలాపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం నాయుడు వెంకటేశ్వరరావు తెలిపారు. అమలాపురం మం డలం భట్నవిల్లి గ్రామానికి చెందిన సుధ స్థానిక ఉన్నత పాఠ శాలలో ఆరో తరగతి చదువుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన కోచ్ పట్టపగలు సంతోష్ శిక్షణలో బాక్సింగ్ తర్ఫీదు పొందిన సుధ ఈనెల 26,27తేదీల్లో విశాఖ జిల్లా పాయక రావుపేట సిద్ధార్థ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీల్లో అండర్-12 బాలికల 42-44కిలోల విభాగంలో సుధ ప్రథమస్థానం సాధించి బంగారు పతకం సాధించింది. జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన సుధను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాం ఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అభినందించారు. పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు.
ఆలమూరు విద్యార్థుల ప్రతిభ
ఆలమూరు, డిసెంబరు 29: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఈనెల26 నుంచి 28వరకు జరిగిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో మండల విద్యార్థులు విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు సీనియర్ కిక్‌బాక్సింగ్ మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. పలువురు విద్యార్థులు వివిధ విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించినట్టు చెప్పారు. విద్యార్థులను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అభినందించి రూ.10వేలు బహుమతి అందించారు. విద్యార్థులను జిల్లా కరాటే మాస్టర్ల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు, మాస్టర్లు, టి.అబ్బులు, సత్తిబాబు, సత్యశ్రీ, నాయకులు తమ్మన శ్రీనివాస్, నెక్కంటి బుజ్జి, అశోక్‌రెడ్డి, తాడి ఆదిత్యారెడ్డి, నామాల శ్రీనివాస్ తదితరులు అభినందించారు.