-
-
Home » Andhra Pradesh » East Godavari » National Protest
-
కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి
ABN , First Publish Date - 2020-11-27T07:38:40+05:30 IST
కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టి న సార్వత్రిక సమ్మెలో కార్మికులు కదంతొక్కారు. తుఫాన్ హెచ్చరికను, భారీవర్షాన్ని లెక్కచేయకుండా ఉదయం 9గంటలకే మెయిన్‌రోడ్డులో ఉన్న తపాలా పోస్టాఫీసువద్దకు చేరుకున్నారు.

- జోరువానలోను కొనసాగిన సార్వత్రిక సమ్మె
- అధికసంఖ్యలో పాల్గొన్న శ్రామికులు
భానుగుడి(కాకినాడ), నవంబరు 26: కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టి న సార్వత్రిక సమ్మెలో కార్మికులు కదంతొక్కారు. తుఫాన్ హెచ్చరికను, భారీవర్షాన్ని లెక్కచేయకుండా ఉదయం 9గంటలకే మెయిన్‌రోడ్డులో ఉన్న తపాలా పోస్టాఫీసువద్దకు చేరుకున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎఫ్‌ఐ టీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీపీఎం, సీపీఐతోపాటుగా వివిధ రకాల పరిశ్రమలు, బ్యాంకింగ్, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, అసంఘటిత రంగ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 10.30గంటలకు సినిమారోడ్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సూపర్‌బజార్, బాలాజీచెరువు, జీజీహెచ్, జిల్లా పరిషత్ వద్దకు చేరుకుంది. అనంతరం సీఐటీయూ అఖిలభారత ఉపా ధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, ఏఐటీ యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు తాటి పాక మధు మాట్లాడారు. కేంద్ర బీజేపీ నాయకులు కార్పొరేట్‌ల సేవలో తరి స్తున్నారన్నారు. దేశమంటే కార్పొరేట్‌లు కాదని, శ్రామికప్రజలేనని తెలియ జేయడానికి సమ్మె జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగసంస్థలను పైవేటీకర ణ చేయకుండా ఆపాలని, ప్రజారోగ్య రంగానికి జీడీపీలో 3శాతం నిధులు కే టాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి శ్రీనివాసు, పౌరసంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజు, రైతు సంఘం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఐద్వానాయకులు సీహెచ్ రమణి పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో...
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 26: కేంద్ర కార్మిక, కర్షక సంఘాల పిలుపు మేరకు రాజమహేంద్రవరంలో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేసింది. గురువారం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎస్‌ఎన్‌ఎల్, జట్టు లేబరు, అంగన్‌వాడీ, గ్యాస్‌డెలివరీ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, ఎస్‌ఫ్‌ఐ, మెడికల్ రిఫ్స్ తదితర సంఘాలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా నగరంలో నిరసన ర్యాలీలు చేశాయి. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.అరుణ్, ఐఎన్‌టీ యూసీ రాష్ట్ర నాయకుడు ఎన్‌వీ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకుడు నల్లా రామారావు, సీఐటీయైు నాయకులు ఎస్‌ఎస్ మూర్తి, ఐఎఫ్‌టీయూ నాయకులు ఏవీ రమణ, జోజి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. దేశలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ప్రతిఘటన పోరాటాలతోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్‌ను ఎలాతెచ్చిందని, రైతాంగానికి వ్యతిరేకంగా మూడు చట్టాలను కరోనా కష్టకాలంలోనే తీసుకువచ్చిందని విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదన్నారు. సీపీఎస్ రద్దుపై గత హామీలు గాలికి వదిలేశారని, దేశంలో ఫాసిస్టు పాలన సాగుతుందన్నారు. తొలుత స్థానిక కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, జట్టు లేబరు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.