మనుస్మ ృతి ప్రతుల దహన ం

ABN , First Publish Date - 2020-12-26T06:30:16+05:30 IST

పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పీడీఎ్‌సయూ, పీవైఎల్‌ఏ, ఏఐకేఎంఎస్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులు దహనం చేశారు.

మనుస్మ ృతి ప్రతుల దహన ం

రామచంద్రపురం, డిసెంబరు 25: పట్టణంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పీడీఎ్‌సయూ, పీవైఎల్‌ఏ, ఏఐకేఎంఎస్‌, దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులు దహనం చేశారు.  పీడీఎ్‌సయూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్దూ, సీపీఐ ఎంఎల్‌ జిల్లా నాయకులు గెద్దాడ సూరిబాబు, పీవైఎల్‌ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, ఎస్సీ,ఎస్టీ సర్పంచ్‌ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు పోతుల మాధవ్‌, అడ్వకేట్‌ గాలింకి చిట్టిబాబు, సత్తిబాబు, శ్రీనివాస్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. 

తాళ్లరేవులో  ప్రతుల దహనం

తాళ్లరేవు, డిసెంబరు 25: కులాల ప్రాతిపదికన మనిషిపుట్టుకలను అభివర్ణించిన మనుస్మృతిని మండల దళిత యునైటెడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సంతపేట సెంటరులో మనుధర్మశాస్త్రం ప్రతులను దళితులు దహనం చేశారు. ముందుగా సంఘం అధ్యక్షుడు మోకా విష్ణుప్రసాద్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులుజక్కల ప్రసాద్‌బాబు, సాధనాల వెంకటరావు, గోడి భాస్కరరావు, ప్రతాప్‌నగర్‌, మెల్లంవారీపేట, మాధవరాయునిపేట, జెల్లావారిపేట గ్రామస్థులు పాల్గొన్నారు. Updated Date - 2020-12-26T06:30:16+05:30 IST