నన్నయలో కొత్తగా సర్టిఫికెట్‌ కోర్సులు

ABN , First Publish Date - 2020-11-07T05:50:12+05:30 IST

యూజీసీ నుంచి తొలిసారిగా నన్నయ విశ్వవిద్యాలయానికి నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన ఫ్రేమ్‌ మార్కు(ఎనఎస్‌క్యుఎఫ్‌)లో తొలి ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు అవకాశం లభించిందని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు.

నన్నయలో కొత్తగా సర్టిఫికెట్‌ కోర్సులు
ప్రోగ్రామ్స్‌ బ్రోచరు ఆవిష్కరిస్తున్న వీసీ

దివానచెరువు, నవంబరు 6: యూజీసీ నుంచి తొలిసారిగా నన్నయ విశ్వవిద్యాలయానికి నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన ఫ్రేమ్‌ మార్కు(ఎనఎస్‌క్యుఎఫ్‌)లో తొలి ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు అవకాశం లభించిందని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. విశ్వవిద్యాలయంలో దీనికి సంబ ంధించిన బ్రోచర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఒక పీహెచడీ, మూడు పీజీ డిప్లమో ప్రోగ్రామ్స్‌, ఐదు సర్టి ్టఫికెట్‌ ప్రోగ్రామ్‌లకు సంబంధించి 9 కోర్సులను ప్రారంభిస్తున్నామన్నారు.
కోర్సుల వివరాలు
 పీహెచడీ-పారిశ్రామిక కెమిసీ్ట్రలో కెమికల్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌/రీసెర్చ్‌ డిగ్రీ ఇన ఇండసీ్ట్ర కెమిసీ్ట్ర యుజీసీ....పీజీ డిప్లమో కోర్సు హైడ్రోకార్బస్‌ మడ్‌లాగింగ్‌లో పీజీ డిప్లమో కోర్సు,  ఇన ఫార్మా ఇండసీ్ట్ర టెక్నిక్స్‌లో పీజీ డిప్లమా కోర్సు, సేంద్రియ సంశ్లేషణ, విశ్లేషణాత్మకతల్లో పీజీ డిప్లమా కోర్సు, ఆక్వా కల్చర్‌ ఫీడ్‌ తయారీ, విశ్లేషణ, నిర్వహణలో సర్టిఫికెట్‌ కోర్సు  ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఫండమెంటల్స్‌, అప్లికేషన్సలో సర్టిఫికెట్‌ కోర్సు ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు,  పుట్టగొడుగుల సాగు, స్థాపన, శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్‌ కోర్సు...
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 23 లోపు దరఖాస్తు సమర్పించాలి. ఈనెల 24, 25 తేదీల్లో దరఖాస్తుదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 26 నుంచి విద్యార్థులు రిపోర్టింగ్‌ చేయాలని తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన ప్రక్రియను డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స నిర్వహిస్తారని చెప్పారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ లేదా 7093008477 నెంబరును సంప్రదించాలన్నారు. యూజీసీ ఎనఎస్‌క్యూఎఫ్‌ నోడల్‌ అధికారి పి.విజయనిర్మల, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స డి.జ్యోతిర్మయి, ఈసీ సభ్యులు కె.శ్రీరమేష్‌, బి.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్‌ కె.రమణేశ్వరి పాల్గొన్నారు.
 


Updated Date - 2020-11-07T05:50:12+05:30 IST