నన్నయ వీసీకి కేరళ సమాజం అభినందనలు

ABN , First Publish Date - 2020-11-06T06:10:09+05:30 IST

నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావుకు కేరళ సమాజం ప్రతినిధులు గురువారం అభినందనలు తెలిపారు. నన్నయ వర్శిటీకి అనుబంధంగా వున్న ఆదిత్య కళాశాలలో బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స చదువుతున్న 91 మంది విద్యార్థులు కొవిడ్‌ సమయంలో స్వరాష్ట్రమైన కేరళ వెళ్లారు.

నన్నయ వీసీకి కేరళ సమాజం అభినందనలు
వీసీ జగన్నాథరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న కేరళ సమాజం ప్రతినిధులు

దివానచెరువు, నవంబరు 5: నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావుకు కేరళ సమాజం ప్రతినిధులు గురువారం అభినందనలు తెలిపారు. నన్నయ వర్శిటీకి అనుబంధంగా వున్న ఆదిత్య కళాశాలలో బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స చదువుతున్న 91 మంది విద్యార్థులు కొవిడ్‌ సమయంలో స్వరాష్ట్రమైన కేరళ వెళ్లారు. ఈ క్రమంలో యూజీసీ ఉత్తర్వులతో రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు డిగ్రీ పరీక్షలు నిర్వహించారు. లాక్‌డౌన కారణంగా కేరళ విద్యార్థులు ఇక్కడకు వచ్చి పరీక్షలు రాయడం సాధ్యం కాలేదు. దీంతో వారికి గత నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆనలైనలో పరీక్షలు నిర్వహించి రెండు రోజుల్లో ఫలితాలను ప్రకటించారు. దీంతో కేరళ సమాజం కార్యదర్శి సీహెచ జాన్సన విశ్వవిద్యాలయంలో వీసీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2020-11-06T06:10:09+05:30 IST