‘నన్నయ’ విద్యార్థినికి బాక్సింగ్‌లో స్వర్ణ పతకం

ABN , First Publish Date - 2020-12-30T05:49:08+05:30 IST

దివాన్‌చెరువు, డిసెంబరు 29: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగం ఆఖరి సంవత్సరం విద్యార్థిని ఎం.తులసి రాష్ట్రస్థాయి థాయ్‌ బాక్సింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత పొందినట్టు ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు

‘నన్నయ’ విద్యార్థినికి బాక్సింగ్‌లో స్వర్ణ పతకం
తులసిని అభినందిస్తున్న వీసీ జగన్నాథరావు

దివాన్‌చెరువు, డిసెంబరు 29: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగం ఆఖరి సంవత్సరం విద్యార్థిని ఎం.తులసి రాష్ట్రస్థాయి థాయ్‌ బాక్సింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత పొందినట్టు ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు. మంగళవారం తులసిని వీసీ సన్మానించారు. విశ్వవిద్యాలయం తరపున తులసికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆమెకు మార్గనిర్దేశం చేస్తున్న రాజనీతిశాస్త్రం విభాగాధిపతి ఎన్‌.రాజశేఖర్‌, కోచ్‌ మధుకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య బట్టు గంగారావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T05:49:08+05:30 IST