‘నన్నయ’కు ఐఎ్‌సవో సర్టిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-12-29T05:30:00+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఐఎ్‌సవో 9001-2015 సర్టిఫికేషన్‌ లభించిందని ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు.

‘నన్నయ’కు ఐఎ్‌సవో సర్టిఫికేషన్‌
ఐఎ్‌సవో సర్టిఫికెట్స్‌ను ఆవిష్కరిస్తున్న ఉప కులపతి జగన్నాథరావు

దివాన్‌చెరువు, డిసెంబరు 29: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఐఎ్‌సవో 9001-2015 సర్టిఫికేషన్‌ లభించిందని ఉప కులపతి మొక్కా జగన్నాథరావు తెలిపారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఎ్‌సవో సర్టిఫికెట్లను ఆయన అవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ ఐఎ్‌సవో సర్టిఫికేషన్‌ ఈ ఏడాది విశ్వవిద్యాలయం సాధించిన గొప్ప విజయమన్నారు. ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి నాక్‌ గుర్తింపులో కచ్చితంగా మంచి గ్రేడ్‌ సాధించాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ నాణ్యతతో పాటు ఉద్యోగ నాణ్యత, వ్యక్తిగత విలువలు పాటిస్తూ నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించాలన్నారు. ఐఎ్‌సవో కోర్‌ కమిటీ కో-ఆర్డినేటర్‌ వి.పెర్సిస్‌, సభ్యులు కె.దీప్తి, సీహెచ్‌కే భవాని, ఎం.బాలకృష్ణ, గౌతమ్‌నాయుడులను సన్మానించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఇంటర్నల్‌ ఆడిటర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య బట్టు గంగారావు, ఈసీ సభ్యులు టి.అశోక్‌, బి.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య ఎస్‌.టేకి, కె.రమణేశ్వరి, ఐక్యూఏసీ ఎగ్జిక్యూటివ్‌ కో-ఆర్డినేటర్‌ కె.స్వామి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST