అత్యధిక వెబినార్లతో తెలుగు రాష్ట్రాల్లో నన్నయ టాప్
ABN , First Publish Date - 2020-10-08T05:54:45+05:30 IST
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక జాతీయ, అంతర్జాతీయ వెబినార్లను నిర్వహించి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రథమస్థానం లో నిలిచింది...

నన్నయ వీసీ జగన్నాథరావు
దివాన్‌చెరువు, అక్టోబరు 7: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక జాతీయ, అంతర్జాతీయ వెబినార్లను నిర్వహించి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రథమస్థానం లో నిలిచిందని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయం లో 50 వెబినార్ల బ్రోచర్‌ను బుధవారం వీసీ ఆవిష్కరించారు. కొవిడ్-19 లాక్‌డౌన్ వంటి క్లిష్టమైన సమయంలో నన్నయలో వెబినార్లను ప్రారంభించామన్నారు. మే నెల నుంచి సెప్టెంబరు వరకూ 50 జాతీయ, అంతర్జాతీయ వెబినార్లు నిర్వహించామన్నారు. దీనికి సహకరించిన విశ్వవిద్యాలయ అధికారులకు అధ్యాపకులకు, సాంకేతిక సిబ్బందికి వీసీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బట్టు గంగారావు, ఈసీ సభ్యులు ఆచార్య కొట్టు శ్రీరమేష్, బి.జగన్మోహనరెడ్డి, వెబ్‌మాస్టర్ ఎం,శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డి,జ్యోతిర్మయి, అసోసియేట్ డైరెక్టర్ కె.దీప్తి, లీగల్ అధికారి ఎన్.నాగేంద్రరావు పాల్గొన్నారు.