త్వరలో నమ్మ మరుగుదొడ్లు

ABN , First Publish Date - 2020-11-13T05:47:18+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 12: పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే కాకినాడలో నమ్మ టాయిలెట్స్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు

త్వరలో నమ్మ మరుగుదొడ్లు
సర్పవరంలో పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ దిన్‌కర్‌

కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ 

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 12: పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే కాకినాడలో నమ్మ టాయిలెట్స్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌ కర్‌ తెలిపారు. సర్పవరం జంక్షన్‌లో వీటి పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేసి గుగూల్‌తో అనుసంధానం చేయడం వల్ల ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలు తెలుసుకోవచ్చని చెప్పారు. మరో 15 రోజుల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

పన్ను వసూళ్లపై సమావేశం

ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా పన్ను వసూళ్లపై కమిషనర్‌ దిన్‌కర్‌  సాధారణ సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 11 నుంచి 20వ డివిజన్‌ వరకూ నియమించిన వార్డు సచివాలయ పరిపాలన కార్యదర్శులు సర్కిల్‌ ఆర్‌ఐ నుంచి ఎంత వసూలు చేశారో తెలుసుకున్నారు. వసూళ్లు తగ్గిన ప్రాంతాల్లో మరింత కృషి చేయాలని సూచించారు.

Updated Date - 2020-11-13T05:47:18+05:30 IST