నాడు-నేడు పనుల్లో ఆలస్యమెందుకు?

ABN , First Publish Date - 2020-12-11T06:06:34+05:30 IST

మండల పరిధిలోని 18 పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నే డు పనుల్లో జాప్యమెందుకు జరుగుతోంది? పనులవి షయంలో అధికారులు ఎందుకు శ్రద్ధ వహించడం లేదని ఇన్‌చార్జి తహశీల్దార్‌, ట్రైనీ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజితా సింగ్‌ ఉపా ధ్యాయులను ప్రశ్నించారు.

నాడు-నేడు పనుల్లో  ఆలస్యమెందుకు?

 ట్రైనీ కలెక్టర్‌ అపరాజితా సింగ్‌ 

రంగంపేట, డిసెంబరు 10: మండల పరిధిలోని 18 పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నే డు పనుల్లో జాప్యమెందుకు జరుగుతోంది? పనులవి షయంలో అధికారులు ఎందుకు శ్రద్ధ వహించడం లేదని ఇన్‌చార్జి తహశీల్దార్‌, ట్రైనీ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజితా సింగ్‌ ఉపా ధ్యాయులను ప్రశ్నించారు. రంగంపేట మెయి న్‌ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆమె గురువారం పరిశీలించారు. అంతకు ముందు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీవో  కేఎస్‌ఎస్‌ సుబ్బారావు ఆధ్వర్యంలో నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు సమావే శం నిర్వహించారు. మండల ఇంజనీరింగ్‌ అధికారి రాము, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి మా ట్లాడుతూ పనులు నాణ్యతతో, వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. పనుల్లో జాప్యం జరగడానికి కారణాలను ప్రధానోపాధ్యాయుల నుంచి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులను ఈవిషయంలో ప్రశ్నించారు. ఇకపై జాప్యం రాకుం డా చూడాలని ఆదేశించారు. ప్రతీ  శుక్రవారం నిర్వహించే సమావేశానికి పనుల పురోగతిని తనకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.శ్రీనివాసరావు, పీఆర్‌ఏఈ రాము, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రాంజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 పంపిణీకి పట్టాలను సిద్ధం చేయండి

మండలంలో ఈనెల 25 నాటికి పంపిణీ చేయనున్న పట్టాలను సిద్ధం చేయాలని, ఇందుకు లేఅవుట్‌లలో జియో ట్యాగింగ్‌ పూర్తిచేయాలని ట్రైనీ కలెక్టర్‌ అపరాజితా సింగ్‌   గ్రామ రెవెన్యూ అధికారులను, సర్వే సహాయకులను ఆదేశించారు. ఆమె కోటపాడు, రామేశ్వరంపేట గ్రామాల పరిధిలోని లేఅవుట్‌లను పరిశీలించారు. లబ్ధిదారులు సంఖ్య, పంపిణీ చేయనున్న పట్టాలు, జియో ట్యాగింగ్‌ విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నా రు. ఈ నెల 15 నాటికి జియోట్యాగింగ్‌ పూర్తిచేయాల్సిందేనని ఆదేశించారు. ఆమె వెంట డీటీ సూర్యప్రభ, ఆర్‌ఐ గాలిబ్‌, వీఆర్వో ఉన్నారు.



Updated Date - 2020-12-11T06:06:34+05:30 IST