ఘనంగా మిలాద్‌ ఉన నబీ వేడుకలు

ABN , First Publish Date - 2020-10-31T06:29:59+05:30 IST

ఘనంగా మిలాద్‌ ఉన నబీ వేడుకలు

ఘనంగా మిలాద్‌ ఉన నబీ వేడుకలు

మామిడికుదురు, అక్టోబరు 30: మహ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌ ఉన నబీ వేడుకలను శుక్రవారం ముస్లింలు భక్తిశ్రద్ధ లతో ఆనందోత్సాహాల మధ్య  నిర్వహిం చారు. ఈసందర్భంగా మామిడికుదురులో సున్నీ జామియా మసీదులో మిలాద్‌ జరిగింది. ఈమిలాద్‌లో మత ప్రబోధకుడు మహ్మద్‌ షాదిక్‌ అన్వనర్‌రజ్వి ప్రసంగిస్తూ మహ్మద్‌ ప్రవక్త బోధనలు ప్రతీ ఒక్కరూ అనుసరించాలన్నారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు మసూద్‌మోహిద్దీన(బాజానీ), గౌస్‌ మొహిద్దీన, సిరాజ్‌, ముఖరంహుస్సేన తదితరులు పాల్గొన్నారు.
ద్రాక్షారామ: ద్రాక్షారామలో శుక్రవారం ముస్లింలు ఈద్‌ మిలాదున్నభి భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు ద్రాక్షారామలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీ యాకుబ్‌, ఎండీ గులాబ్‌, ఎస్‌కె బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆత్రేయపురం: మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. శుక్రవారం ర్యాలి మసీదులో మతపెద్ద వలియా ఆధ్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కట్టుంగ, బొబ్బర్లంక తదితర గ్రామాల్లోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు.   


Read more