బాపు బాటలో పయనించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-10-03T07:25:01+05:30 IST
ప్రతి ఒక్కరూ మహనీయుని బాటలో పయనించాలని కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 2: ప్రతి ఒక్కరూ మహనీయుని బాటలో పయనించాలని కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి రాజకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్బలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.