భార్యను హత్య చేసిన భర్త
ABN , First Publish Date - 2020-11-13T08:01:59+05:30 IST
మద్యం మత్తులో క్షణికావేశంతో భార్యను గొడ్డలి తో తలపై నరికి భర్తే హత్య చేసిన సం ఘటన గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్లవరం మండలం యెంట్రుకోన కొత కాలనీలో ఉల్లింగి వెంక టలక్ష్మి(40) భర్త శ్రీనివాసరావు చేతిలో హత్యకు గురైంది.
- యెంట్రుకోన కొత్త కాలనీలో ఘటన
అల్లవరం, నవంబరు 12: మద్యం మత్తులో క్షణికావేశంతో భార్యను గొడ్డలి తో తలపై నరికి భర్తే హత్య చేసిన సం ఘటన గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్లవరం మండలం యెంట్రుకోన కొత కాలనీలో ఉల్లింగి వెంక టలక్ష్మి(40) భర్త శ్రీనివాసరావు చేతిలో హత్యకు గురైంది. గ్రామంలో గురువారం ఒక వ్యక్తి మృతిచెందగా అంత్యక్రియల్లో పాల్గొన్న శ్రీనివాసరావు మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను భోజనం వడ్డించ మని అడిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భోజనం నీవే పెట్టుకో అని భార్య అనడంతో కోపోద్రిక్తు డైన శ్రీనివాసరావు ఆమె చెంపపై కొట్టి పక్కనున్న గొడ్డలితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వెంకటలక్ష్మి హత్యకు గురైన ప్రాంతా న్ని అమలాపురం డీఎస్పీ షేక్ మసూ మ్‌బాషా పరిశీలించారు. రావులపాలెం సీఐ వి.కృష్ణ, తాలూకా ఎస్‌ఐ సీహెచ రాజేష్ సంఘటనాస్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. వెంకటలక్ష్మి కువైట్‌లో మూడేళ్ల పాటు ఉపాధి పొంది మూడునెలల క్రితమే స్వగ్రామంలోని యెంట్రుకోన వచ్చిందని స్థానికులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో యెంట్రుకోన గ్రామం ఉలిక్కిపడింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అమలా పురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.