ముద్రగడ నిర్ణయాన్ని మార్చుకోవాలి

ABN , First Publish Date - 2020-07-19T15:59:43+05:30 IST

ఉద్యమం నుంచి తప్పుకుంటానని తీసుకున్న నిర్ణయాన్ని..

ముద్రగడ నిర్ణయాన్ని మార్చుకోవాలి

ఉభయగోదావరి జిల్లాల జేఏసీ నాయకులు


రావులపాలెం(తూర్పు గోదావరి): ఉద్యమం నుంచి తప్పుకుంటానని తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం మార్చుకోవాలంటూ ఉభయగోదావరి జిల్లాల జేఏసీ నాయకులు కోరారు.  గోపాలపురంలో కాపు ఉద్యమనేత ఆకుల రామకృష్ణను  జేఏసీ నాయకులు కలిసి ముద్రగడ తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. ముద్రగడ నిర్ణయం బాధాకరమన్నారు. దీనిపై కాపు జేఏసీ త్వరలో ఇతర జిల్లాల కాపు జేఏసీ నాయకులతో సమావేశం నిర్వహించి ముద్రగడ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, పశ్చిమగోదావరి జిల్లా జేఏసీ నాయకులు వెంకటరాయుడు, దాసరి రాందాసుతోపాటు ఇతరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-19T15:59:43+05:30 IST