అడ్డగోలు మట్టి తవ్వకాలు!

ABN , First Publish Date - 2020-06-25T10:09:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల భూములను మెరక చేసే ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూము ల్లో

అడ్డగోలు మట్టి తవ్వకాలు!

ఇళ్ల స్థలాల మెరక పేరుతో ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు

అడ్డగించే అధికారులపై అధికార పార్టీ నేతల ఆగ్రహ జ్వాలలు

మట్టి కొరతతో ముందుకు సాగని  ఇళ్ల స్థలాల మెరక పనులు

వందల ఎకరాల్లో మెరక ప్రశ్నార్థకమే

ఇరిగేషన్‌, డ్రెయిన్స్‌, హెడ్‌వర్క్స్‌కుచెందిన భూముల్లో తవ్వకాలు

ఆయా గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత


(అమలాపురం-ఆంధ్రజ్యోతి):  రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల భూములను మెరక చేసే ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూము ల్లో సైతం ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గోదావరి పరీవా హక లంక గ్రామాలతోపాటు డ్రైయిన్స్‌, కాల్వగట్లు, ఇతర పోరంబోకు భూముల్లోని మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఇందుకు అధికా రులు సైతం క్షణాల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారు. మట్టి కొరత కారణంగా పట్టాల పంపిణీ నాటికి భూములు సిద్ధమయ్యే పరిస్థితులు లేకపోవడంతో రెవెన్యూతో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల్లో కలవరం మొదలైంది.


నవరత్నాల అమలులో భాగంగా వచ్చే నెల 8వ తేదీన ఇళ్లస్థలాలను పేదలకు పంపిణీ  చేసేందుకు కోనసీమ వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. వీటిలో ఎక్కువ భూములు వైసీపీకి చెం దిన నేతల సిఫారసులతో జనసంచారానికి దూరంగా, ముంపునకు దగ్గరగా ఉన్న భూములను అమలాపురం డివిజన్‌లో అధికారులు సేకరించారు. ఈ భూములను పూడ్చాలంటే సుమారు రూ.75 కోట్లు పైనే వెచ్చించాల్సి ఉందనేది అనధికారిక అంచనా. అయితే స్థాని కంగా భూములు ఇచ్చిన నాయకులు తమ రాజకీయ పలుకుబడితో గోదావరి పాయలు, లంక ప్రాంతాలు, ఏటిగట్లు, డ్రెయిన్స్‌, ఇరిగేషన్‌ గట్ల వెంబడి ఉన్న భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు అభ్యంతరం పెడుతుంటే అధికార బలంతో ఎదురు దాడికి దిగుతున్నారు.


కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలంలో సుమారు 200 ఎకరాల భూమిని మెరక చేసేందుకు ఉపాధిహామీ పథకంతోపాటు కలెక్టర్‌ మంజూరు చేసిన ప్రత్యేక నిధులతో పనులు చేస్తున్నారు. గతంలో వానపల్లి దగ్గర లంక మట్టి తవ్వేందుకు స్థానిక నాయకులు ప్రయత్నిస్తే తీవ్ర మైన ప్రతిఘటన ఎదురైంది. దాంతో అధికారులు వెనక్కి తగ్గి కొత్త పేట సమీపాన ఉన్న తొగరపాయపై దృష్టి పెట్టారు. అక్కడి నుంచి నిరంతరం ఇష్టారాజ్యంగా మట్టి, తువ్వ ఇసుకను తరలించుకు పోయి సమీపంలోని ప్రభుత్వం సేకరించిన భూములను మెరక చేస్తున్నారు. అదేవిధంగా అమలాపురం రూరల్‌ మండలం పేరూరు లంకతోట శివారులో ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన ముం పు భూములను మెరక చేసేందుకు స్థానిక నాయకులు చేస్తున్న తవ్వకాలకు ఇరిగేషన్‌శాఖ అధికారులు బ్రేక్‌ వేశారు.


అంబాజీపేట మండలం వాకలగరువులో ఇరిగేషన్‌ స్థలంలో ఉన్న మట్టిని తవ్వేం దుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా అక్కడి గ్రామస్తులు అడ్డు తగిలారు. దాంతో నాయకులు ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ను ఆశ్ర యించి క్షణాల్లో అంబాజీపేట తహశీల్దార్‌ నుంచి మట్టి తవ్వేందుకు అనుమతులు పొందారు. వాకలగరువు ఇరిగేషన్‌ స్థలంతోపాటు పేరూరు సమీపంలో ఉన్న డ్రైయిన్‌ చెంతన కూడా మట్టిని తవ్వి భూములను మెరక చేస్తున్న ప్రక్రియకు బుధవారం ఇరిగేషన్‌శాఖ అధికారులు బ్రేక్‌ వేశారు. ఇరిగేషన్‌శాఖ అనుమతి లేకుండా తవ్వ ద్దంటూ ఏఈ సందీప్‌ పనులను అడ్డగించడంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధుల సిఫారసుతో అదే భూమిలో మట్టి తవ్వేందుకు ఇరిగేషన్‌శాఖపై ఒత్తిడి ప్రారంభించారు. అమ లాపురం తహశీల్దార్‌ కేవీ మాధవరావు ఇరిగేషన్‌ డీఈకి మట్టి కోసం లేఖ రాసి అనుమతుల కోసం ప్రయత్నం మొదలుపెట్టారు.

Updated Date - 2020-06-25T10:09:05+05:30 IST