ఎంఎస్‌వో సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2020-09-03T11:08:56+05:30 IST
ఎంఎస్‌వోగా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో సుభాష్ చేసిన సేవలు అభినందనీయమని తహశీల్దార్లు జిలానీ, రామకృష్ణ

రావులపాలెం రూరల్, సెప్టెంబరు 2: ఎంఎస్‌వోగా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో సుభాష్ చేసిన సేవలు అభినందనీయమని తహశీల్దార్లు జిలానీ, రామకృష్ణ అన్నారు. రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో రావులపాలెం, ఆత్రేయపురం మండలాలకు చెందిన డీలర్లు ఎంఎస్‌వోను ఘనంగా సత్కరించారు. ఇటీవల రిటైర్డు అయిన అంబటి రామకృష్ణను తహశీల్దార్లు ఘనంగా సత్కరించారు.