ఎంపీడీవో చిన్నబాబు సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2020-10-01T08:02:41+05:30 IST

ఎంపీడీవోగా చిల్లె చినబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని తహశీల్దారు ప్రకాష్‌బాబు అన్నారు. వెలుగు కార్యాలయం వద్ద

ఎంపీడీవో చిన్నబాబు సేవలు చిరస్మరణీయం

రాయవరం, సెప్టెంబరు 30: ఎంపీడీవోగా చిల్లె చినబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని తహశీల్దారు ప్రకాష్‌బాబు అన్నారు. వెలుగు కార్యాలయం వద్ద బుధవారం చినబాబు సంస్మరణ సభ నిర్వహించారు.


తహశీల్దారు కేవీ ప్రకాష్‌బాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ఎంపీడీవో కరోనా వైరస్‌తో మృతి చెందడం ఉద్యోగులను కలిచివేసిందన్నారు. తొలుత ఎంపీడీవో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌, రెవెన్యూ, వెలుగు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2020-10-01T08:02:41+05:30 IST