-
-
Home » Andhra Pradesh » East Godavari » mp vanga geeta met central minister
-
ఉప్పాడ తీరానికి సముద్ర కోత నుంచి రక్షణ కల్పించండి
ABN , First Publish Date - 2020-12-30T05:42:17+05:30 IST
ఉప్పాడ తీర ప్రాంతానికి సముద్ర కోత నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని కేంద్ర పర్యావరణ, వాతావరణ, అటవీ శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ని కోరినట్టు కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ తెలిపారు.

- కేంద్ర పర్యావరణ మంత్రిని కోరిన కాకినాడ ఎంపీ వంగా గీత
కొత్తపల్లి, డిసెంబరు 29: ఉప్పాడ తీర ప్రాంతానికి సముద్ర కోత నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని కేంద్ర పర్యావరణ, వాతావరణ, అటవీ శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ని కోరినట్టు కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మంత్రిని కలిసి కాకినాడ నుంచి తుని సమీపంలోని ఈదటం వరకు ఉన్న బీచ్ రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కాకుండా నిత్యం సముద్రంలో ఏర్పడే పోటు, పాట్లతో ఉప్పాడ బీచ్ రోడ్డు కోతకు గురవుతోందని, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. తుపాన్లు వచ్చిన సమయాల్లో కోనపాపపేట నుంచి ఉప్పాడ శివారు సుబ్బంపేట ఉన్న తీర ప్రాంత గ్రామాలు కూడా సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పారు. సముద్ర కోత నుంచి శాశ్వత రక్షణకు సంబంధించిన ప్రాజెక్టును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపగా తక్షణ చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ చెప్పారు.