-
-
Home » Andhra Pradesh » East Godavari » MP Bharat Ram
-
రైతుబజార్లలో ధరలు అదుపులో ఉండాలి
ABN , First Publish Date - 2020-03-25T10:11:47+05:30 IST
లాక్‌డౌన్‌లో భాగంగా రాజమహేంద్రవరంలో 144 సెక్షన్ అమలులో వున్నందున్న ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకురావాలని, ధరలు అదుపులోవుంచాలని ఎంపీ భరత్ రామ్ కోరారు.

ఎస్టేట్ అధికారులకు ఎంపీ, కమిషనర్ ఆదేశాలు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24: లాక్‌డౌన్‌లో భాగంగా రాజమహేంద్రవరంలో 144 సెక్షన్ అమలులో వున్నందున్న ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకురావాలని, ధరలు అదుపులోవుంచాలని ఎంపీ భరత్ రామ్ కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన, కమిషనర్ అభిిషిక్తి కిషోర్‌లు రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సమావేశమయ్యారు.
ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రైతు బజార్లలో కూరగాయాలు, కిరాణా సరుకులు అందుబాటులో ఉంచాలని, ఎవ్వరు ధరలు పెంచిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతుబజార్లకు వచ్చే ప్రజలకు కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. కమిషనర్ అభిషిక్తి కిషోర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.