-
-
Home » Andhra Pradesh » East Godavari » mnadapeta mla vegulla huoses issue
-
ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులకు అన్యాయం
ABN , First Publish Date - 2020-12-28T05:27:21+05:30 IST
కపిలేశ్వరపురం, డిసెంబరు 27: అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు రాలేదంటూ పలువురు మహిళలు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పడమరఖండ్రికలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వద్ద కోలపల్లి సూర్యకుమారి,

ఎమ్మెల్యే వేగుళ్ల వద్ద మహిళల ఆవేదన
కపిలేశ్వరపురం, డిసెంబరు 27: అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు రాలేదంటూ పలువురు మహిళలు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పడమరఖండ్రికలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వద్ద కోలపల్లి సూర్యకుమారి, ఏలేటి పద్మ, తదితరులు స్థలాల పంపిణీలో తమ కు అన్యాయం జరిగిదంటూ వాపోయారు. స్థలం, ఇళ్లు లేనితాము వలంటీర్లకు దరఖాస్తులు అందజేసినప్పటికీ వాటిని రెవెన్యూ సిబ్బంది బుట్టదాఖలు చేసి అర్హులకులైన తమకు పట్టాలు రాకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. దీనిపై అడుగుతుంటే సమాదానం చెప్పకపోవడంతో తమ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉండి స్థలాలు రానివారు సమస్యను తన దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి స్థలాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.