నరసన్న ఆలయంలో ఎమ్మెల్సీ అంగర పూజలు

ABN , First Publish Date - 2020-12-17T06:17:28+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ బుధవారం విచ్చేశారు.

నరసన్న ఆలయంలో ఎమ్మెల్సీ అంగర పూజలు

అంతర్వేది, డిసెంబరు 16: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ బుధవారం విచ్చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి అంతరాలయంలో స్వామి దర్శనం చేయించి వేదపండితులతో మహదాశీర్వచనం ఇప్పించారు. అనంతరం ఎమ్మెల్సీ అధికారులతో కలిసి నూతన రథం నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ వై.భద్రాజీ, రామ్మోహన్‌ స్నేహితులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-17T06:17:28+05:30 IST