ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2020-10-29T05:24:33+05:30 IST

ఏలేశ్వరం, అక్టోబరు 28: వివిధ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా జీవనోపాధిని

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఏలేశ్వరంలో వీధి వ్యాపారులకు రుణాల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పర్వత

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌

ఏలేశ్వరం, అక్టోబరు 28: వివిధ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం ద్వారా మెప్మా ప్రాజెక్టు ఆధ్వర్యంలో రుణాల మంజూరు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌, మెప్మా ప్రాజెక్టు టీఎంసీ టి.సాయికుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్రాబ్యాంక్‌ ద్వారా పట్టణ పరిఽధిలోని 60మంది వీధి వ్యాపారులకు రాయితీ రుణాల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం శ్రీనివాసా నర్సింగ్‌హోమ్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్‌ బ్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వివిధ వార్డుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, శిథిల భవనాల తీరును పరిశీలించారు. ఆసుపత్రిని 30 నుంచి 50 పడకలస్థాయికి పెంచడంతో పాటు అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులు కేటాయించడంతో ఎమ్మెల్యే ఏపీహెచ్‌ఎమ్‌ఐడీసీ అధికారులతో నూతన భవనాల నిర్మాణం, శిథిల భవనాల మరమ్మతుల కోసం చేపట్టాల్సిన పనులపై సమీక్ష జరిపారు. కార్యక్రమాల్లో అలమండ చలమయ్య, బదిరెడ్డి గోవిందు, మూది నారాయణస్వామి, శిడగం వెంకటేశ్వరరావు, సామంతుల సూర్యకుమార్‌, సుంకర రాంబాబు, బొదిరెడ్డి గోపాలకృష్ణ, దాకమర్రి సూరిబాబు పాల్గొన్నారు.     

రూ.8.30 కోట్లతో ఆసుపత్రి అభివృద్ధి

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి ప్రభుత్వం రూ.8.30 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌ తెలిపారు. వైద్యవిధాన పరిషత్‌, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు చెందిన వార్డులు, ల్యాబ్‌లు, ఆపరేషన్‌ థియేటర్‌, సీమాంత్‌సెంటర్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 30 నుంచి 50 పడకల స్థాయికి ఆసుపత్రి రూపొందుతుందన్నారు. తహశీల్దార్‌ పివివి గోపాలకృష్ణ, ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ స్వప్న, వైసీపీ మండల కన్వీనర్‌ బెహర దొరబాబు, బిగోవిందు, పంచాయతీ కార్యదర్శి ద్విభాష్యం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T05:24:33+05:30 IST