ముడోసారి ఉత్తమ ఎమ్మెల్యేగా మల్లాడి

ABN , First Publish Date - 2020-12-13T05:54:24+05:30 IST

యానాం నియోజకవర్గ ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముడోసారి ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.

ముడోసారి ఉత్తమ ఎమ్మెల్యేగా మల్లాడి

యానాం, డిసెంబరు 12: యానాం నియోజకవర్గ ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముడోసారి ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. పుదుచ్చేరి స్పీకర్‌, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ శివకోలందు నేతృత్వంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి వి.నారాయణసామి, ప్రతిపక్ష నాయకుడు ఎన్‌.రంగసామి, అన్నాడీఎంకె అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్‌ ఎ.అన్బలగన్‌, డీఎంకేపార్టీ అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌ ఆర్‌.శివ మల్లాడిని ఉత్తమ ఎమ్మెల్యేగా ప్రతిపాదించారు. యానాం ప్రజలకు మల్లాడి అందించిన సేవలు, కరోనా సమయంలో చేసిన కార్యక్రమాలను గుర్తించి ఉత్తమ ఎమ్మెల్యే అవార్డుకు ఎంపిక చేశారు.  ఉత్తమ శాసనసభ్యుడి అవార్డుతో పాటు ఎమ్మెల్యేగా 25 సంవత్సరాలు పనిచేసినందుకు అసెంబ్లీలో మాల్లాడిని  సత్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పీకర్‌ శివకోలందు తెలిపారు. అలాగే యానాం ప్రజల సమక్షంలో జనవరి 6న మల్లాడి పరిపాలన రజతోత్సవాన్ని నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును మల్లాడి అందుకోనున్నారు. మూడోసారి ఏకగ్రీవంగా తన పేరును ప్రతిపాదించినందుకు కమిటీ సభ్యులందరికీ మల్లాడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-13T05:54:24+05:30 IST