-
-
Home » Andhra Pradesh » East Godavari » mla dwarampudi visit works
-
సముద్రపు పోటు నీరు రాకుండా ఆపాలి
ABN , First Publish Date - 2020-11-21T05:36:00+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), నవంబరు 20: మేజర్ కల్వర్టుకు లాకింగ్ సిస్టమ్ అమర్చడం ద్వారా సముద్రపు పోటు నీరు దుమ్ములపేటలోకి రాకుండా ఆపాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికారులకు సూచించారు. సముద్రపు పోటు నీరు రైల్వే ట్రాక్ దిగు

సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), నవంబరు 20: మేజర్ కల్వర్టుకు లాకింగ్ సిస్టమ్ అమర్చడం ద్వారా సముద్రపు పోటు నీరు దుమ్ములపేటలోకి రాకుండా ఆపాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికారులకు సూచించారు. సముద్రపు పోటు నీరు రైల్వే ట్రాక్ దిగువ గల మేజర్ క్రాస్ కల్వర్టు ద్వారా చేరుతూ వీధులు మునిగిపోతున్నాయని స్థానిక నాయకులు తెలపడంతో శుక్రవారం కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పదో డివిజన్ దుమ్ములపేటలో ముంపునకు గురువుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ఉప్పుటేరు నీరు ఊరిలోకి రాకుండా లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులకు ఆయన సూచించారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ ఈఈ పి.సత్యకుమారి, వైసీపీ నాయకులు గద్దేపల్లి దాసు, మట్టపర్తి రఘురామ్, ఎరిపల్లి సీతారామరాజు పాల్గొన్నారు.