ప్రయాణాలు మాని.. ప్రాణాలు కాపాడండి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-25T10:06:09+05:30 IST

ప్రజలెవరూ ప్రయాణాలు చేయకుండా తమతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

ప్రయాణాలు మాని.. ప్రాణాలు కాపాడండి: ఎమ్మెల్యే

బిక్కవోలు, మార్చి 24: ప్రజలెవరూ ప్రయాణాలు చేయకుండా తమతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బిక్కవోలు వంతెన వద్ద కెనాల్‌రోడ్డుపై గులాబీపువ్వులిచ్చి ప్రయాణాలు ఆపుచేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈనెల 31 వరకు స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ. సుబ్బారెడ్డి, కేపీఆర్‌ . సంస్థల డైరెక్టర్‌ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ పోతుల ప్రసాదరెడ్డి, తహసీల్దార్‌ ఎం. వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఎం. అనుపమ తదితరులు పాల్గొన్నారు.

Read more