‘ఎమ్మెల్యే సంజాయిషీ ఇవ్వాలి’

ABN , First Publish Date - 2020-10-03T06:33:37+05:30 IST

రాజమహేంద్రవరం- కాకినాడ కెనాల్‌ రోడ్డు విషయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వాలని

‘ఎమ్మెల్యే సంజాయిషీ ఇవ్వాలి’

అనపర్తి, అక్టోబరు 2: రాజమహేంద్రవరం- కాకినాడ కెనాల్‌ రోడ్డు విషయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలకు సంజాయిషీ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ  కెనాల్‌ రోడ్డు అభివృద్ధి కోసం తాను అంసెబ్లీలో ఏనాడూ ప్రస్తావించలేదని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు తమ వద్ద సాక్షాలు ఉన్నాయని తెలిపారు. తాను అసెంబ్లీలో ప్రస్తావించిన, దానికి అప్పటి మంత్రి ఇచ్చిన సమాధానాల వీడియోలు కూడా ఉన్నాయన్నారు. కెనాల్‌ రోడ్డు మరమ్మతులకు మంజూరైన నిధుల వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-10-03T06:33:37+05:30 IST