మంత్రి విశ్వరూప్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2020-10-03T07:10:08+05:30 IST
మండలంలో గోడి, గోడిలంక గ్రామాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు

అల్లవరం, అక్టోబరు 2: మండలంలో గోడి, గోడిలంక గ్రామాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గోడిలో వైసీపీ రాష్ట్ర మాజీకార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో విశ్వరూప్ జన్మదిన కేక్‌ను కట్‌చేశారు. పంచాయతీ కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జల్లి ఏడుకొండలు, రొక్కాల బాబూజీ, మాకే వెంకటరమణ పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమై ఏడాదైన సందర్భంగా గోడిలంకలో నాతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, గోడిలో బొమ్మి ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.