పేదలందరికీ ఇళ్లు సీఎం ఆశయం

ABN , First Publish Date - 2020-12-28T05:14:14+05:30 IST

మలికిపురం, డిసెంబరు 27: రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఇళ్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ ఆశయమని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. ఆదివారం శంకరగుప్తంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 241 మంది నిరుపేద మహిళలకు ఆయన ఇళ్ల స్థలాలు

పేదలందరికీ ఇళ్లు సీఎం ఆశయం
శంకరుగుప్తంలో ఇళ్ల పట్టాలు అందిస్తున్న మంత్రి వేణు, కలెక్టర్‌, నాయకులు

మంత్రి చెల్లుబోయిన వేణు 

జిల్లాలో 3 లక్షల 54 వేలమంది లబ్ధిదారులకు 

ఇళ్ల స్థలాలు: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

మలికిపురం, డిసెంబరు 27: రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఇళ్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌ ఆశయమని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. ఆదివారం శంకరగుప్తంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 241 మంది నిరుపేద మహిళలకు ఆయన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదల సొంతింటి కలను జగన్‌ నెరవేర్చారని, ఇది ఆయన ఒక్కడికే సాధ్యమన్నారు. రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం చారిత్రక ఘట్టమని మంత్రి చెప్పారు. కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 3 లక్షల 54వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. లక్ష 50వేల గృహాలు మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి పట్టా ఇచ్చిన ప్రతి ఒక్కరికీ మూడు అవకాశాలు ఇచ్చారని, వాటిని ఎంపిక చేసుకుని లబ్ధి పొందవచ్చని ఆయన తెలిపారు. కా ర్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-28T05:14:14+05:30 IST