28 వరకు జనతా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-03-25T10:12:29+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల28 వరకు యానాం నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విధించామని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.

28 వరకు జనతా కర్ఫ్యూ

రేషన్‌కార్డుకు రూ.రెండు వేలు పరిహారం 

 ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి ప్రకటన


యానాం, మార్చి 24: కరోనా వైరస్‌ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల28 వరకు యానాం నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విధించామని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం పుదుచ్చేరి సీఎం వి.నారాయణసామితో మంత్రి మల్లాడి సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఉన్న 3.50లక్షల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2వేలు పరిహారం ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారని మల్లాడి తెలిపారు. ప్రతి ఇంటికి రెండు సబ్బులు, ప్రతి ఒక్కరికి మాస్క్‌లు ఇస్తామన్నారు. పుదుచ్చేరిలోని  ఆసుపత్రులను పరిశీలించడం,  యానాంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.

Read more