రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2020-05-24T09:40:00+05:30 IST

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామస్థాయిలో రైతులకు విత్తన పంపిణీ వంటి ..

రైతు సంక్షేమమే ధ్యేయం

 మంత్రి కన్నబాబు 


సర్పవరం జంక్షన్‌, (కాకినాడ) మే 23: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామస్థాయిలో రైతులకు విత్తన పంపిణీ వంటి బృహత్తర కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర వ్యవసాయ,సహకార మంత్రి కురసాల కన్నబాము పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్‌లో క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో శనివారం రైతులకు రాయితీపై వరి విత్తనాలు, పచ్చిరొట్ట పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్‌ 2020 -21కు సంబంధించి తొలిసారిగా గ్రామస్థాయిలో రైతులకు విత్తనాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకోసం జిల్లాకు సంబంధించి 780 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 11,580 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. రైతులు సచివాలయాల వద్ద వ్యవసాయ సహాయకులను సంప్రదించి విత్తనాలు పొందాలని కోరారు. ఈనెల 30న 10,461 రైతు భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభించనున్న ట్టు ఆయన వెల్లడించారు. అధికారులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 


‘ఉమా మనోవికాస కేంద్రం సేవలు అభినందనీయం’

లాక్‌డౌన్‌లో జిల్లాలో ఉన్న దివ్యాంగులు, విభిన్నవంతుల కుటుంబాలకు ఉమా మనోవికాస కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఉమామనో వికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌పి రెడ్డి, హాంకాంగ్‌ అండ్‌ షాంగై బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎ్‌సబీసీ) గివ్‌ ఇండియా ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో సమకూర్చిన బియ్యం, నిత్యావసర వస్తువులను మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత దివ్యాంగులకు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-05-24T09:40:00+05:30 IST