-
-
Home » Andhra Pradesh » East Godavari » minister kannababu
-
కాకినాడ రూరల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం
ABN , First Publish Date - 2020-12-10T05:42:55+05:30 IST
కరప, డిసెంబరు 9: అధికారులు, నాయకుల సహకారంతో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం ఆయన కరపలో పలు అభి వృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు

మంత్రి కురసాల కన్నబాబు
కరపలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
కరప, డిసెంబరు 9: అధికారులు, నాయకుల సహకారంతో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం ఆయన కరపలో పలు అభి వృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంచినీటి చెరువు చుట్టూ రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి, సుందరీకరణ పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న శాఖా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు. గ్రామదేవత ఉప్పాలమ్మతల్లిని దర్శించుకుని గుడి పునర్నిర్మాణానికి, శిథిలావస్థలో ఉన్న శివాలయం, విష్ణాలయాల ఆధునీకరణకు చర్య లు తీసుకుంటామన్నారు. నాయీ బ్రాహ్మణులకు త్వరలోనే కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని హామీఇచ్చారు. అనంతరం మండల విద్యావనరుల కేంద్రంలో ఉపాధ్యాయులతో మంత్రి సమావేశమయ్యారు. అధికారులు, ఉపాధ్యాయులు నాడు-నేడు పనులు సక్రమంగా పూర్తిచేసి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులున్నారని, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేయాలని సూచించారు. తదనంతరం కరప సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల ఆర్థిక అక్షరాస్యత సాధించేందుకు సొసైటీలు కృషి చేయాలన్నారు. బ్యాంక్ లావాదేవీల్లో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. గొడ్డటిపాలెం, కరప, గొర్రిపూడి గ్రామాల్లో పర్యటించి ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను మంత్రి పరామర్శించి సంతాపం తెలిపారు. కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు యాళ్ల సుబ్బారావు, చింతా ఈశ్వరరావు, రెడ్డిపల్లి రమేష్, చాగంటి సూరిబాబు, బండే తాతాజీ, తుమ్మలపల్లి గోవిందురాజు, చొల్లంగి దుర్గారావు, నక్కా వీరభద్రరావు, పాట్నీడి భీమన్న, ఎంపీడీవో కర్రె స్వప్న, తహశీల్దార్ సీహెచ్.ఉదయభాస్కర్, ఎంఈవో బులికృష్ణవేణి, పంచాయతీరాజ్ ఏఈ ఎస్.వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి త్రినాధ్ పాల్గొన్నారు.