ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు

ABN , First Publish Date - 2020-10-07T09:07:34+05:30 IST

వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ట్రాన్స్‌కో ఏఈ దుర్గాప్రసాద్‌ తెలిపారు...

ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు

ఆత్రేయపురం, అక్టోబరు 6: వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ట్రాన్స్‌కో ఏఈ దుర్గాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ర్యాలి సచివాలయంలో రైతులకు అవగాహన కల్పించారు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ సదుపాయం ప్రభుత్వం కొనసాగిస్తుందని, ప్రతీ కనెక్షన్‌కు మీటరు అమర్చి ఎంతవాడుతున్నారో నిర్ధారిస్తామని ఆయన తెలిపారు. మోటార్లు అమర్చే విషయంలో రైతులంతా సహకరించాలని కోరారు.  బోణం సాయిబాబా, కప్పల శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Read more