జీజీహెచ్‌కు వైద్య పరికరాల అందజేత

ABN , First Publish Date - 2020-10-28T05:09:48+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), అక్టోబరు 27: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ(సీఎ్‌సఆర్‌)లో భాగంగా కెనరా బ్యాంక్‌లో భాగమైన క్యాన్‌ఫిన్‌ హోమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ జీజీహెచ్‌కు

జీజీహెచ్‌కు వైద్య పరికరాల అందజేత
పరికరాలకు సంబంధించిన పత్రాన్ని సూపరింటెండెంట్‌కు అందజేస్తున్న క్యాన్‌ఫిన్‌ హోమ్స‌ ప్రతినిధులు

జీజీహెచ్‌ (కాకినాడ), అక్టోబరు 27: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ(సీఎ్‌సఆర్‌)లో భాగంగా కెనరా బ్యాంక్‌లో భాగమైన క్యాన్‌ఫిన్‌ హోమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ జీజీహెచ్‌కు రూ.8.79 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేసింది. రూ.4,42,400 విలువైన హైఫ్లోనాజల్‌ క్యానులా (హెచ్‌ఎ్‌ఫఎన్‌సీ) పరికరాన్ని, అలాగే రూ.4,36,800 విలువైన 2 బీ ప్యాప్‌ పరికరాలను సంస్థ సీనియర్‌ మేనేజర్‌ నాగాంజనేయబాబు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘ వేంద్రరావుకు అందజేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ క్యాన్‌ఫిన్‌ సంస్థ సాయంతో కొవిడ్‌ పేషెంట్లకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ గిరిధర్‌, సంస్థ ప్రతినిధులు హరినారాయణ, కె.శ్రీనివాసు, ప్రసన్నకుమార్‌, ఎం.శ్రీనివాసరావు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T05:09:48+05:30 IST