-
-
Home » Andhra Pradesh » East Godavari » Measures to control pests
-
తెగుళ్ల నివారణకు చర్యలు
ABN , First Publish Date - 2020-10-07T10:24:10+05:30 IST
వర్జీనియా పొగాకు నారుమళ్లలో తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని తొర్రేడు పొగాకు బోర్డు వేలం నిర్వాహణాధికారి జె.సురేంద్రకుమార్ రైతులకు సూచించారు...

సీతానగరం, అక్టోబరు 6: వర్జీనియా పొగాకు నారుమళ్లలో తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని తొర్రేడు పొగాకు బోర్డు వేలం నిర్వాహణాధికారి జె.సురేంద్రకుమార్ రైతులకు సూచించారు. మంగళవారం మిర్తిపాడులో వర్జీనియా పొగాకు నారుమళ్ళను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారుమళ్ళలో ఆకుపచ్చ నల్లకాడ తెగుళ్ళు కనిపిస్తున్నాయన్నారు. నారుతీసే సమయంలో నాలుగురోజుల ముందు ఫేమ్ 2.5ఎమ్‌ఎల్ నిమిస్టార్ 5ఎం ఎల్ మందును, పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి రమణమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్‌ఎంవేణు, మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.