-
-
Home » Andhra Pradesh » East Godavari » meals only 5 rupess start
-
రూ.5కే భోజనం ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-26T05:28:21+05:30 IST
పిఠాపురం, నవంబరు 25: పేదల ఆకలి తీర్చేందుకు స్వేచ్ఛ ఫౌండేషన్ సేవా దృక్పథంలో చేపడుతున్న రూ.5కే భోజన పథకాన్ని బుధవారం పట్టణంలోని

పిఠాపురం, నవంబరు 25: పేదల ఆకలి తీర్చేందుకు స్వేచ్ఛ ఫౌండేషన్ సేవా దృక్పథంలో చేపడుతున్న రూ.5కే భోజన పథకాన్ని బుధవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి సమీపంలో మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ మురాలశెట్టి సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతీ పేదవాడి కడుపు నిండేలా రూ.5కే అన్నం, కూర, సాంబారు, పచ్చడి, తాగునీటి సదుపాయంతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు, అనాథలు, చిరు వ్యాపారులకు భోజనం అందిస్తున్నామని ఆయన చెప్పారు.