గణిత పాఠ్యపుస్తక రచయితగా మూర్తి ఎంపిక

ABN , First Publish Date - 2020-10-31T06:34:25+05:30 IST

2020-21 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి గణితశాస్త్ర పాఠ్య గ్రంథ రచనకు అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని డాక్టర్‌ టీఎస్‌వీఎస్‌.సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు.

గణిత పాఠ్యపుస్తక రచయితగా మూర్తి ఎంపిక


అమలాపురం టౌన, అక్టోబరు 30:
2020-21 విద్యా సంవత్సరానికి ఏడో తరగతి గణితశాస్త్ర పాఠ్య గ్రంథ రచనకు అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని డాక్టర్‌ టీఎస్‌వీఎస్‌.సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం-2020 అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాఠ్య పుస్తకాలను రూపొందిస్తుందన్నారు.  రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణా సంస్థ సంచాలకుడు ప్రతాప్‌రెడ్డి నుంచి తనకు ఉత్తర్వులు అందాయని శుక్రవారం మూర్తి తెలిపారు. 

Read more