మాస్కు లేదు..రూ.500 జరిమానా
ABN , First Publish Date - 2020-10-29T05:24:35+05:30 IST
మాస్కులు ధరించకుండా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ జరిమానా విధించారు.

పిఠాపురం రూరల్, అక్టోబరు 28: మాస్కులు ధరించకుండా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ జరిమానా విధించారు. పిఠాపురం మండలం జల్లూరు గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ గుమస్తా పి.నానిబాబు, వెటర్నరీ ఆసిస్టెంట్ కె.యశ్వంత్ మాస్క్‌లు ధరించకపోవడాన్ని గుర్తించారు. దీనిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించని ఇద్దరికి రూ.500 వంతున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన ఎఫ్‌కే పాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట తహశీల్దారు జి.వరహాలయ్య, వ్యవసాయాధికారి అచ్యుతరావు ఉన్నారు.